ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది: కోదండరాం

ఫీజుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నాడు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Published : 06 Feb 2020 20:38 IST

హైదరాబాద్‌: ఫీజుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నాడు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. విద్య పేరుతో ప్రైవేటు సంస్థలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు విద్యను అందించాల్సిన బాధ్యత ప్రైవేటు విద్యా సంస్థలకు లేదా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్‌లో అనుమతి లేకుండా ఎన్నో కళాశాలలు నడుపుతున్నారని, వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చిన్నారుల కలలను అడ్డంపెట్టుకుని ప్రైవేటు విద్యా సంస్థలు కోట్లు కొల్లగొడుతున్నాయని విమర్శించారు. ఈ పద్దతిలో మార్పులు రావాలని కోదండరాం అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని