‘మోదీ.. ప్రధానిలా వ్యవహరించడం లేదు’

ప్రధాన మంత్రిలా నరేంద్రమోదీ వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ నుద్దేశించి ‘ట్యూబ్‌లైట్‌’ అని ప్రధాని గురువారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో....

Published : 07 Feb 2020 23:05 IST

దిల్లీ: ప్రధాన మంత్రిలా నరేంద్రమోదీ వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ను ఉద్దేశించి ‘ట్యూబ్‌లైట్‌’ అని ప్రధాని గురువారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌ బయట మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని అంటే హుందాగా ఉండాలి. ఉన్నతంగా వ్యవహరించాలి. మన ప్రధాని మాత్రం అలా వ్యవహరించడం లేదు’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిరుద్యోగం చర్చ జరగాలని తాము కోరుతుంటే అడ్డుకోవాలని భాజపా చూస్తోందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని