ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యేకు కీలక పదవి

మూసీ నది తీరప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్

Updated : 08 Feb 2020 23:03 IST

హైదరాబాద్‌: మూసీ నది తీరప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్ రెడ్డి కేబినెట్ హోదాలో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన సుధీర్ రెడ్డి.. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో వైఎస్ హయాంలో హుడా ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం సుధీర్ రెడ్డికి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని