వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాకుసిద్ధమా?:బుద్ధా

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ బెదిరింపుల వల్లే కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 10 Feb 2020 00:44 IST

మంగళగిరి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ బెదిరింపుల వల్లే కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబును మాధవ్‌ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాధవ్‌ వ్యవహార శైలితో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. మాధవ్‌ను నియోజకవర్గం నుంచి ఎప్పుడు సాగనంపుదామా అని హిందూపురం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఐగా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అవినీతి గురించి ఆయన పనిచేసిన ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో చెప్తారన్నారు. అమరావతి ప్రజాభిప్రాయ సేకరణపై విశాఖ జిల్లాలోని నలుగురు తెదేపా ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలోని వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాజీనామా చేసే దమ్ముందా?అని బుద్ధా సవాల్ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని