ఆ హక్కు ఎంఐఎంకు లేదు: రాజాసింగ్‌

హిందూ దేవాలయాల అభివృద్ధికి నిధులు అడిగే హక్కు ఎంఐఎంకు లేదని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. హిందూ వ్యతిరేక మచ్చ తొలగించుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని...

Published : 11 Feb 2020 00:43 IST

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌: హిందూ దేవాలయాల అభివృద్ధికి నిధులు అడిగే హక్కు ఎంఐఎంకు లేదని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. హిందూ వ్యతిరేక మచ్చ తొలగించుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో హిందువుల గోవులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాకే దేవాలయాల అభివృద్ధి గురించి మాట్లాడాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియో సందేశాన్ని ఆయన పోస్ట్‌ చేశారు. పాతబస్తీలోని కాళీమాత ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికలో భాగంగానే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రగతి భవన్‌కు వెళ్లారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ ఎంఐఎంకు కాకుండా రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించాలని హితవుపలికారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి సీఎం తమకు సమయం ఇవ్వడంలేదని, అదే ఎంఐఎం నాయకులకు మాత్రం అడగకుండానే సమయం కేటాయిస్తున్నారని రాజాసింగ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు