ఫలితమేదైనా.. నాదే బాధ్యత: తివారీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మరోసారి నిరాశ కలిగించాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆప్‌ విజయం దిశగా దూసుకెళ్తోండగా.. కాషాయ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది.

Updated : 11 Feb 2020 15:34 IST

దిల్లీ: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మరోసారి నిరాశ కలిగించాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆప్‌ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. కాషాయ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే తుది ఫలితం వచ్చేంతవరకు గెలుపుపై తమకు నమ్మకముందని అంటున్నారు భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ. 

‘ట్రెండ్స్‌ను చూస్తుంటే చాలా చోట్ల భాజపా, ఆమ్‌ ఆద్మీ మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇంకా సమయం ఉంది. గెలుపుపై మేం నమ్మకంగా ఉన్నాం. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఫలితం ఏదైనా అందుకు పూర్తి బాధ్యత నాదే’ అని తివారీ అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమవడానికి ముందు భాజపా 55 స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ తివారీ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని