మంత్రులతో దోబూచులాడుతోన్న విజయం

దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆప్‌ 56 చోట్ల ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నియోజకవర్గంలో

Published : 11 Feb 2020 12:18 IST

దిల్లీ: దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆప్‌ 56 చోట్ల ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. అయితే ఓ వైపు ఆప్‌ జయకేతనం ఎగురవేస్తుండగా.. మరోవైపు కేజ్రీవాల్‌ సర్కార్‌లోని కొందరు మంత్రులకు మాత్రం ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైంది. ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, రెవెన్యూ మంత్రి కైలాశ్‌ గెహ్లోత్‌, హోంమంత్రి సత్యేంద్ర జైన్‌లతో విజయం దోబూచులాడుతోంది. 

ప్రతాప్‌గంజ్‌ నుంచి పోటీ చేస్తున్న మనీశ్‌ సిసోడియాకు ఆది నుంచే గట్టి పోటీ ఎదురైంది. భాజపా అభ్యర్థి రవి నేగి, సిసోడియా మధ్య ఆధిక్యం ఊగిసలాడుతోంది. నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి సిసోడియా.. రవి నేగి కంటే 1427 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఒక దశలో రవి నేగిపై సిసోడియా కేవలం 74 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. 

ఇక నాజఫ్‌గఢ్‌ నుంచి బరి ఉన్న కైలాశ్‌ గెహ్లోత్‌ తన సమీప భాజపా అభ్యర్థి అజీత్‌ సింగ్‌ కంటే కేవలం 600 పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. షకర్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న సత్యేంద్ర జైన్‌ తన సమీప అభ్యర్థిపై కేవలం 51 ఓట్ల ఆధిక్యంలో కొనసాగడం గమనార్హం. దాదాపు 10 స్థానాల్లో ఆప్‌, భాజపా అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా 1000 ఓట్ల లోపే ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని