భాజపా ఓటమి దీంతో ముగిసేలా లేదు: పవార్‌

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటర్లను వారి నమ్మకాల ఆధారంగా ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అందులో విఫలమైందని మహారాష్ట్ర ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించడంపై మంగళవారం ఆయన స్పందించారు.

Published : 12 Feb 2020 00:33 IST

పుణె: దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటర్లను వారి నమ్మకాల ఆధారంగా ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అందులో విఫలమైందని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ అన్నారు. దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించడంపై మంగళవారం ఆయన స్పందించారు. ‘భాజపా ఎప్పటిలాగే ఓటర్లను నమ్మకాల ఆధారంగా ఆకర్షించేందుకు యత్నించింది... కానీ దిల్లీ ప్రజలు ఆ ఎత్తుల్ని తిరస్కరించడంతో ఆ పార్టీ విఫలమైంది. దిల్లీ ఎన్నికల ఫలితాలు నాకు ఆశ్చర్యం కలిగించవు. ఎందుకంటే దేశంలో మార్పు కోసం గాలి వీస్తుందనడానికి ఈ ఫలితాలు స్పష్టమైన సంకేతం. నేటి ఫలితాలు ఒక్క దిల్లీకే పరిమితం కాదు. ఎందుకంటే దేశరాజధానిలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఉంటారు. వారి రాష్ట్రాల్లో కోరుకుంటున్న మార్పుని దిల్లీలో ఓటు ద్వారా వెల్లడించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో  భాజపా ఓటమి పాలవడం మనం చూశాం. ఈ పరిస్థితి చూస్తుంటే భాజపా ఓటమి ఇప్పటితో ముగిసేటట్లు లేదు. భాజపాను పక్కన పెట్టేందుకు మహారాష్ట్ర మాదిరిగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి’ అని పిలుపునిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని