తేలుకుట్టిన దొంగల్లా తెదేపా నేతలు:అంబటి

ఐటీ దాడుల వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. తేలుకుట్టిన దొంగల్లా తెదేపా నేతలు వ్యవహరిస్తు్న్నారని ఆయన ఆరోపించారు.

Updated : 14 Feb 2020 18:03 IST

అమరావతి: ఐటీ దాడుల వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. తేలుకుట్టిన దొంగల్లా తెదేపా నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతిని చంద్రబాబే ప్రవేశపెట్టారని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.వేలకోట్లు దోచేశారని ఆరోపించారు. మాజీ పీఎస్‌ ఇంటిపై దాడిచేస్తేనే రూ.2వేల కోట్లు దొరికాయని.. చంద్రబాబు, లోకేశ్‌ను ప్రశ్నిస్తే మరిన్ని రూ.కోట్లు దొరుకుతాయన్నారు. చెప్పారు. రాష్ట్రంలోని ఐటీ దాడులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎందుకు ప్రశ్నించడం లేదని అంబటి దుయ్యబట్టారు. 

యనమల వకాల్తా పుచ్చుకున్నారా?: ఉమ్మారెడ్డి

ఐటీ దాడులపై తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు వకాల్తా పుచ్చుకున్నారా? అని వైకాపా సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. జగన్‌ జైలుకు వెళ్తారని ఎద్దేవా చేసిన చంద్రబాబుకూ అదే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు ఒక్కరేనని.. దీనిలో ఎక్కడా గందరగోళం లేదని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఐటీ దాడులపై చంద్రబాబే స్పందించాలని.. తన మాజీ వ్యక్తిగత కార్యదర్శి అక్రమాలకు పాల్పడలేదని భావిస్తే ఆ విషయమే ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి డొల్ల కంపెనీలు స్థాపించే స్థాయి చంద్రబాబు మాజీ పీఎస్‌కు ఉందా అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని