మండలి ఛైర్మన్‌ దస్త్రం..మళ్లీ వెనక్కి!

సెలక్ట్‌ కమిటీల ఏర్పాటుపై ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పంపిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలంగా షరీఫ్‌ మండలి కార్యదర్శికి

Updated : 14 Feb 2020 20:27 IST

అమరావతి: సెలక్ట్‌ కమిటీల ఏర్పాటుపై ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పంపిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ షరీఫ్‌ మండలి కార్యదర్శికి ఇటీవల దస్త్రాన్ని పంపగా.. అది నిబంధనలకు విరుద్ధమంటూ మండలి కార్యదర్శి దాన్ని తిప్పి పంపారు. మండలి ఛైర్మన్‌ మళ్లీ దాన్ని కార్యదర్శికి పంపినప్పటికీ తాజాగా రెండోసారి కూడా ఆయన తిప్పి పంపారు. నిబంధనల ప్రకారం సెలక్ట్‌ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ ఛైర్మన్‌కు పంపిన నోట్‌లో మండలి కార్యదర్శి తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు గడువులోగా సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు కానందున బిల్లులు ఆమోదం పొందినట్లేనని, ఇక రావాల్సింది గవర్నర్‌ ఆమోదమేనని మంత్రులు, అధికారపార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి..

ఆమోదమా.. ఆర్డినెన్సా?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని