వెనక్కి పంపడం సభా నియమాల ఉల్లంఘనే

సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై పరిశీలిస్తోంది. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి వెనక్కి పంపడం సభా....

Updated : 14 Feb 2020 21:56 IST

అమరావతి: సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై పరిశీలిస్తోంది. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని కార్యదర్శి వెనక్కి పంపడం సభా నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సభ్యులెవరైనా దీనిపై నోటీసు ఇవ్వొచ్చని అయన వెల్లడించారు. క్రమశిక్షణ చర్యల కింద కఠిన నిర్ణయం తీసుకునే అధికారం ఛైర్మన్‌కు ఉందని తెలిపారు. పార్టీ పరంగానూ దీనిపై ఏం చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని అయన చెప్పారు.

ఇదీ చదవండి..
మండలి ఛైర్మన్‌ దస్త్రం..మళ్లీ వెనక్కి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని