పీఏసీఎస్‌ల ఓట్ల లెక్కింపు షురూ!

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడక్కడా చెదురుమదురు

Updated : 15 Feb 2020 16:57 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. రాష్ట్రంలో మొత్తం 909 పీఏసీఎస్‌లు ఉండగా.. 157 ఏకగ్రీవమయ్యాయి.మిగతా సొసైటీలకు శనివారం పోలింగ్‌ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం పోలింగ్‌ నమోదైంది. 6,248 వార్డుల్లో సభ్యులైన రైతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలైనప్పటికీ ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ మద్దతుదార్లను గెలిపించుకొనేందుకు శర్వశక్తులూ ఒడ్డాయి.

సిరిసిల్ల పీఏసీఎస్‌ను తెరాస మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. మొత్తం 13 డైరెక్టర్‌ స్థానాలను కైవసం చేసుకున్నారు. 

రేపు, ఎల్లుండి పీఏసీఎస్‌ ఛైర్మన్లను వార్డు సభ్యులు ఎన్నోకోనున్నారు. అలాగే, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లతో పాటు మార్క్‌ఫెడ్‌ పాలక వర్గాలను పీఏసీఎస్‌ ఛైర్మన్లు ఎన్నుకుంటారు. ఈ నెల 17 లేదా, 18న డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని