రేపే తెలంగాణ కేబినెట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. కేబినెట్‌...

Published : 15 Feb 2020 20:40 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో తేదీలపైనా రేపటి భేటీలో స్పష్టత రానుంది. కొత్త రెవెన్యూ చట్టం అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ, పట్టణాభివృద్ధి పైనా కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ నెల 25లోగా జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్‌ సమ్మేళనాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. రెండు దశల్లో పల్లె ప్రగతి ప్రారంభించిన ప్రభుత్వం.. త్వరలోనే పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కేబినెట్‌ భేటీలో పట్టణ ప్రగతి పైనా చర్చించి తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. నీటిపారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్‌వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటనలో కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో దీనిపైనా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకొవచ్చని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు