పొత్తుల్లేవ్‌.. ఒంటరిగానే గెలుద్దాం: నడ్డా

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మూలంగా రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొందరి స్వార్థం వల్లే అధికారానికి....

Published : 16 Feb 2020 19:12 IST

ముంబయి: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మూలంగా రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కొందరి స్వార్థం వల్లే అధికారానికి దూరమయ్యామని, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఒంటరి పోరుకు సిద్ధమవ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముంబయిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో కార్యకర్తలనుద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు.

‘‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భాజపాకే ఓటేసినప్పటికీ కొందరు వ్యక్తిగత స్వార్థంతో ప్రతిపక్షంతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారు’’ అని పరోక్షంగా శివసేననుద్దేశించి నడ్డా విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రంలో ఒంటరిగా అధికారంలోకి రానున్నామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇకపై మహారాష్ట్రలో జరగబోయే భవిష్యత్‌ ఎన్నికలన్నింట్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామన్నారు. భాజపా వర్సెస్‌ ఇతర పార్టీలుగా సాగే ఈ పోరుకు కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని