మండలి ఛైర్మన్‌కు ఆ అధికారం ఉంది

ఇటీవల జరిగిన ఐటీ దాడులపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవాస్తవాలు ప్రచురించిన సాక్షిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. త్వరలోనే

Updated : 17 Feb 2020 16:30 IST

అమరావతి: ఇటీవల జరిగిన ఐటీ దాడులపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవాస్తవాలు ప్రచురించిన సాక్షిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. త్వరలోనే ప్రెస్‌ కౌన్సిల్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. పరువు నష్టం దావా కూడా వేసేందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సెలెక్ట్‌ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. శాసన పరిషత్‌ కార్యదర్శిపై చర్యలు తీసుకొనే అధికారం మండలి ఛైర్మన్‌కు ఉందన్న యనమల.. కార్యదర్శిపై ప్రభుత్వం అంత ఒత్తడి తేవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రపతికి వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన బాధ్యత తమపై ఉందనీ.. అందుకనుగుణంగానే త్వరలోనే ఎమ్మెల్సీలు దిల్లీకి వెళ్తారని చెప్పారు. అలాగే, గవర్నర్‌ను కూడా కలిసి వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగానే తమ విధానం ఉంటుందని యనమల స్పష్టంచేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని