- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
భీమా-కోరేగావ్ కేసు కేంద్రానికి ఇవ్వలేదు:ఠాక్రే
ముంబయి: పలు విషయాల్లో మహా వికాస్ ఆఘాడీ కూటమి సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టతనిచ్చారు. ఎన్‌పీఆర్ అమలు, భీమా-కోరేగావ్ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. ఈ పరిణామాల తర్వాత నేడు మీడియాతో మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
భీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులు రెండు వేరువేరని ఉద్ధవ్ తెలిపారు. భీమా కోరేగావ్ కేసు దళిత సోదరులకు సంబంధించినదని.. ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసును ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించలేదన్నారు. కేవలం ఎల్గార్ పరిషత్ కేసు మాత్రమే ఎన్‌ఐఏకి బదిలీ అయిందని చెప్పుకొచ్చారు. ఇక ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ వేరువేరు అంశాలన్నారు. సీఏఏ అమలైనా ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్‌సీని మాత్రం రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ ఎన్‌ఆర్‌సీ అమలైతే.. హిందూ, ముస్లింలతో పాటు ఆదివాసీలపైనా ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటి వరకు కేంద్రం కూడా చర్చించలేదన్నారు. ఎన్‌పీర్ కేవలం పది సంవత్సరాలకు ఒకసారి జరిగే సెన్సెస్ ప్రక్రియ మాత్రమేనన్నారు. దీని వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదని అభిప్రాయపడ్డారు.
సీఏఏపై ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయంతో శరద్ పవార్ విభేదించారు. సీఏఏ అమలైనా చింతించాల్సిన అవసరం లేదనడం ఉద్ధవ్ వ్యక్తిగత అభిప్రాయమని.. ఎన్సీపీ మాత్రం సీఏఏకి వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తుచేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: పూరీ ఆలోచనల్లో అనన్య లేదు.. ‘లైగర్’ భామ ఆమె కాదు..!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TS High Court: ఆ భూమి రామానాయుడు కుటుంబానిదే.. తీర్పు వెలువరించిన హైకోర్టు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
-
Viral-videos News
Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్గా మారిన వీడియో
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’