నమామి గంగ తరహాలో మూసీని పరిరక్షించండి

మూసీనదిని పరిరక్షించాలని.. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో వెంకయ్యనాయుడుతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు.

Updated : 19 Feb 2020 17:16 IST

మూసీ నది ప్రక్షాళనపై ఉపరాష్ట్రపతితో కోమటిరెడ్డి భేటీ

దిల్లీ: మూసీనదిని పరిరక్షించాలని.. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో వెంకయ్యనాయుడుతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. కాలుష్యంతో మూసీనది ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీటితో మూసీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్నారు. 300 నుంచి 500 అడుగుల వరకు నీరు కలుషితం అవుతోందని తెలిపారు. ఆ నీటితో పండించిన పంటలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కోమటిరెడ్డి వివరించారు. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని కోరారు. జీరో అవర్‌లో పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తినా కేంద్రం స్పందించలేదని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. కోమటిరెడ్డి వినతిపై స్పందించిన వెంకయ్య.. ఫోన్‌లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో మాట్లాడారు. మూసీ నది సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని ఉపరాష్ట్రపతి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని