ఏపీ ఈఎస్‌ఐలో రూ.70కోట్ల అవినీతి!

ఏపీ ఈఎస్‌ఐలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. రూ.975 కోట్లతో కొనుగోలు చేసిన ఔషధాలు, పరికరాల్లో రూ.70 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. 2014-2019 వరకు జరిపిన కొనుగోళ్ల

Updated : 21 Feb 2020 15:51 IST

అమరావతి: ఏపీ ఈఎస్‌ఐలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. రూ.975 కోట్లతో కొనుగోలు చేసిన ఔషధాలు, పరికరాల్లో రూ.70 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. 2014-2019 వరకు జరిపిన కొనుగోళ్ల డాక్యుమెంట్లను విజిలెన్స్‌ అధికారులు పరిశీలించగా ముగ్గురు డైరెక్టర్ల పదవీకాలంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఈఎస్‌ఐ ఆస్పత్రులు, 3 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, 78 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు ఔషధాలు, పరికరాల కొనుగోలులో అవినీతి జరిగింది. ఈఎస్‌ఐలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

బాధ్యులెవర్నీ వదిలిపెట్టం: మంత్రి జయరాం

ఈఎస్‌ఐలో జరిగిన అవినీతికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అవకతవకలు జరిగాయన్నారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా ఈ అవకతవకలతో సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని