గతంలో ఎన్నో కమిటీలు వేశారు.. ఏమైంది?

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

Published : 22 Feb 2020 18:35 IST

ట్విటర్‌లో లోకేశ్‌

అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. విచారణలు, కమిటీలతో చంద్రబాబును గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏమీ చేయలేకపోయారని ట్విటర్‌లో పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో జగన్‌ కూడా ఎన్ని కమిటీలు వేసినా ఏమీ చేయలేకపోయారన్నారు. మంత్రివర్గ ఉపసంఘాలు, అధికారుల కమిటీలు వేసిన జగన్‌.. తాజాగా సిట్‌ వేశారనీ.. సాధించేదేమీ లేనప్పుడు సిట్‌లతో కాలక్షేపం చేయాలని చూస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రేషన్‌ కార్డులు, పింఛన్లలో కోతలు వేశారనీ.. వీటిని పక్కదారి పట్టించేందుకే సిట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని లోకేశ్‌ ఆరోపించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని