విచారించడం కక్ష సాధింపెలా అవుతుంది:బొత్స

జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాకే అమరావతిలోని ప్రారంభ దశ పనులను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు...

Published : 22 Feb 2020 15:33 IST

విజయనగరం: జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాకే అమరావతిలోని ప్రారంభ దశ పనులను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు ఆనాడే గుర్తించినట్లు మంత్రి చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే విషయాన్ని అందరికీ స్పష్టం చేసినట్లు తెలిపారు. అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుందని బొత్స ప్రశ్నించారు. అమరావతి పేరుతో దోపిడీ, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గురించి చెబితే.. విచారణ జరిపి తప్పులుంటే శిక్షించాలని ప్రతిపక్ష నేతలే చెప్పారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు సిట్‌కి ఇవ్వడాన్ని కూడా వారే తప్పుబడుతున్నారని ఆక్షేపించారు.

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్‌ విచారణ చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని