Updated : 22 Feb 2020 19:28 IST

రైతుబంధు నిధులు అందుతున్నాయ్‌.. కానీ..!

ప్రెస్‌మీట్‌లో మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుబంధు పథకం అమలు కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతుబంధు నిధులు అందరికీ జమ అవుతున్నాయన్నారు. కానీ కొన్ని చోట్ల సాంకేతిక లోపాలతో నిధులు బదిలీ కావడంలేదని చెప్పారు. రైతుబంధు సీలింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. పంట రుణాలకు సంబంధించి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి వివరించారు. రైతుబంధు అమలు తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఈ విషయంలో అనవసర ఆరోపణలు చేసే విపక్ష నేతలు ఆధారాలు చూపించాలన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు భారీగా పెరగాలి..

సాగు చేయాల్సిన పంటలపై రైతులకు అవగాహన ఉంటేనే వారికి లాభాలు వస్తాయని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మన దేశంలో నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ సాగు భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నూనె దిగుమతులు తగ్గితేనే విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుకు రాయితీలు ఇస్తున్నప్పటికీ రైతులు ముందుకు రావడం లేదన్నారు. ఆయిల్‌ఫెడ్‌ ద్వారానే ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ ఒకేతరహా పంటలు వేస్తే గిట్టుబాటు ధర రాదని.. పంటను అమ్ముకోవాలన్నా సమస్యలు ఎదురవుతాయని మంత్రి వివరించారు. పంట మొత్తం ప్రభుత్వమే కొనేలా ఎలాంటి విధివిధానాలు లేవని స్పష్టం చేశారు. 15 మిలియన్‌ టన్నుల నూనెను విదేశాల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్