‘టన్‌ టనా టన్‌’ గొప్పలు తగ్గిస్తే మంచిది!

యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో బంగారం నిల్వల గురించి వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్ శనివారం వ్యంగ్యంగా స్పందించారు. విషయం లేకపోయినా ‘టన్‌ టనా టన్‌’ అంటూ ప్రభుత్వం సంచలన వార్తలు సృష్టించడం తగ్గిస్తే మంచిదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

Published : 24 Feb 2020 00:45 IST

దిల్లీ: యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో బంగారం నిల్వల గురించి వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్ శనివారం వ్యంగ్యంగా స్పందించారు. విషయం లేకపోయినా ‘టన్‌ టనా టన్‌’ అంటూ ప్రభుత్వం సంచలన వార్తలు సృష్టించడం తగ్గిస్తే మంచిదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ‘మన ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఎందుకంత ఉవ్విళ్లూరుతోంది. మొదట యూపీలో 3350 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని చెప్పారు. అది కాస్తా ఇప్పుడు 160 కిలోలే అంటూ జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) తెలిపింది. కాబట్టి ప్రభుత్వం కొంచెం ‘టన్‌ టనా టన్‌’ అంటూ సంచలనాలు సృష్టించే వార్తలను తగ్గిస్తే మంచిది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు ఆ జిల్లా మైనింగ్‌ అధికారులు శుక్రవారం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అధికారులు స్పందిస్తూ.. మైనింగ్‌ అధికారులు చెబుతున్నట్లుగా ఆ ప్రాంతంలో అంత పెద్దస్థాయిలో బంగారాన్ని గుర్తించలేదని చెప్పారు. ఒకవేళ అక్కడ ఉన్న అన్ని బంగారు నిక్షేపాలను వెలికితీసి శుద్ధి చేసినా టన్నుకు కేవలం 3.03 గ్రాముల చొప్పున మొత్తం 160కిలోల బంగారం మాత్రమే వస్తుందని చెప్పారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts