‘మహా’ కూటమిలో విభేదాల్లేవ్‌: ఉద్ధవ్‌

మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. కూటమిలో ఎలాంటి విభేదాల్లేవని స్పష్టంచేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని......

Published : 25 Feb 2020 00:46 IST

ముంబయి: మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. కూటమిలో ఎలాంటి విభేదాల్లేవని స్పష్టంచేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు మంచి సమన్వయంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ‘మహా వికాస్‌ అఘాడీ’లోని శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఈ బంధం మరింత బలోపేతమయ్యేలా పనిచేయాలని సూచించారు.

ఇటీవల దిల్లీకి వెళ్లిన సమయంలో సోనియాతో సమావేశం బాగా జరిగిందని ఉద్ధవ్‌ ఎమ్మెల్యేలతో చెప్పారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ నాయకత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నట్టు వివరించారు. జపా చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించినట్టు సమాచారం. మూడు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఎన్‌పీఆర్‌, సీఏఏ తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని