దిల్లీ ఎన్నికల నుంచే అల్లర్లకు కుట్ర: ఏచూరి

దిల్లీ శాసనసభ ఎన్నికల నుంచే దేశ రాజధానిలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భాజపా నేతలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ........

Published : 27 Feb 2020 00:43 IST

దిల్లీ: దిల్లీ శాసనసభ ఎన్నికల నుంచే దేశ రాజధానిలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భాజపా నేతలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో హింస చెలరేగిన ఈశాన్య దిల్లీలో సాధారణ పరిస్థితి తీసుకురావడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. కర్ఫ్యూ విధించినా అల్లర్లు కొనసాగడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. దిల్లీలో శాంతి నెలకొనాలంటే ఆర్మీని రంగంలోకి దించడం మినహా మరో మార్గంలేదన్నారు. 

ఈ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షానే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు కృషిచేయాలని కోరారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి ప్రజలను సంయమనం పాటించాలని తాము కోరతామన్నారు. శాంతి ర్యాలీలకు అనుమతివ్వని కేంద్రం.. రెచ్చగొట్టేవారిని మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తోందని కేంద్రం తీరుపై ఏచూరి మండిపడ్డారు. దిల్లీలో చెలరేగిన అల్లర్లలో మృతిచెందినవారి, క్షతగాత్రుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన పరిహారం ఇవ్వాలని ఇవ్వాలని కోరారు. దిల్లీ ఘర్షణల్లో మృతుల సంఖ్య 22కు చేరగా.. వందలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని