షా రాజీనామా కోరడం హాస్యాస్పదం: భాజపా

ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. అమాయక సిక్కుల....

Published : 27 Feb 2020 00:43 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా తిప్పికొట్టింది. అమాయక సిక్కుల రక్తంతో తడిసిన చేతులు వాళ్లవని, అలాంటి వారు ఇవాళ హింస గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించింది. ఈశాన్య దిల్లీలో హింసకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని సోనియా డిమాండ్‌ చేయడాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.

దిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు హోంమంత్రి అమిత్‌షా సమీక్షిస్తున్నారని జావడేకర్‌ తెలిపారు. అలాంటి వ్యక్తిని రాజీనామా కోరడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసే ఇలాంటి వ్యాఖ్యలు పోలీసుల్లో ఎలాంటి ధైర్యాన్నీ నింపలేవన్నారు. ఇలాంటి విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. దేశ రాజధానిలో శాంతి స్థాపనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts