అల్లర్లపై రాజకీయం చేస్తున్నారు: భాజపా ఫైర్‌ 

హింసాత్మక ఘటనల్ని కాంగ్రెస్‌, ఆఫ్‌ రాజకీయం చేస్తున్నాయని భాజపా దుయ్యబట్టింది. హెడ్‌ కానిస్టేబుల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మ మృతిపై రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం........

Updated : 27 Feb 2020 19:52 IST

దిల్లీ: హింసాత్మక ఘటనల్ని కాంగ్రెస్‌, ఆప్‌ రాజకీయం చేస్తున్నాయని భాజపా దుయ్యబట్టింది. హెడ్‌ కానిస్టేబుల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మ మృతిపై రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ శాంతి కోసం ప్రయత్నించేందుకు పనిచేయాలన్నారు. గత రెండు మాసాల క్రితం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ర్యాలీ నిర్వహించినప్పటి నుంచి హింసను ప్రేరేపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈశాన్య దిల్లీలో శాంతిని పునరుద్ధరించేందుకు భాజపా ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్‌, ఆప్‌ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దిల్లీలో ఆప్‌ పరిపాలిస్తున్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలు శాంతికోసం కృషిచేస్తున్నారని చెప్పారు. సీఎం కేజ్రీవాల్‌ మాత్రం బాధితులను అసెంబ్లీలో మతం ఆధారంగా గుర్తించారని ఆక్షేపించారు. ఈ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమర్థంగా వ్యవహరించడం వల్లే రెండు రోజుల్లోనే శాంతి స్థాపన సాధ్యమైందన్నారు. అలాంటిది షా రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడం చిల్లర రాజకీయాలకు ప్రతీక అన్నారు. 

సాధారణ పరిస్థితి నెలకొనడం శుభపరిణామం
హింసాత్మక ఘటనలతో దద్ధరిల్లిన ఈశాన్య దిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనడం మంచి పరిణామమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని