‘అమిత్‌షా జీ.. నేనొక ఎంపీనని చెప్పండి’

ఈశాన్య దిల్లీలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శిరోమణి అకాళీదళ్‌ ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌.........

Published : 27 Feb 2020 20:11 IST

దిల్లీ పోలీసుల తీరుపై అకాళీదళ్‌ ఎంపీ ఆగ్రహం

దిల్లీ: ఈశాన్య దిల్లీలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శిరోమణి అకాళీదళ్‌ ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు లేఖ రాశారు. ఘర్షణల సమయంలో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఉదాసీనతతో వ్యవహరించారని లేఖలో ఆరోపించారు. భాజపా మిత్రపక్షానికి చెందిన గుజ్రాల్‌.. అల్లర్లు జరిగిన మౌజ్‌పూర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో చిక్కుకుపోయిన 16 మందిని కాపాడాలని బుధవారం రాత్రి 11.43 గంటల సమయంలో పోలీసులను కోరానని చెప్పారు. అల్లరిమూక ఆ ఇంటిపై దాడిచేస్తున్న సమయంలో వారికి  సహాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్టు  లేఖలో పేర్కొన్నారు. తన ఫిర్యాదు పోలీసులకు అందినా వారు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఓ ఎంపీనని వాళ్లకు చెప్పండి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆ ఇంటి పొరుగున ఉన్న వారు వచ్చి కాపాడటం వల్లే ఆ 16 మంది  ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని తెలిపారు. ఒక ఎంపీ వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసినప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. పోలీసుల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగడం ఆశ్చర్యమేమీ కాదని ఆయన మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని