గత ప్రధానులు చెప్పిందే మోదీ చేస్తున్నారు: నడ్డా

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మహాత్మాగాంధీ సహా మాజీ ప్రధానులు ఏం చెప్పారో ప్రస్తుతం ప్రధాని మోదీ అదే అమలు చేస్తున్నారని భాజపా....

Published : 27 Feb 2020 23:49 IST

సిమ్లా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి మహాత్మాగాంధీ సహా మాజీ ప్రధానులు ఏం చెప్పారో ప్రస్తుతం ప్రధాని మోదీ అదే అమలు చేస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో గురువారం నిర్వహించిన ఓ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ ప్రపంచస్థాయి నాయకుడు. అగ్రదేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం మోదీని ప్రశంసించారు. పక్క దేశాల్లోని మైనారిటీలు ఎదుర్కొంటున్న హింసపై గతంలో మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఎన్నోసార్లు మాట్లాడారు. వారు చెప్పారు కాబట్టే మోదీ సీఏఏ అమలు చేస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టం మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తుంది’ అని వెల్లడించారు. 

‘సీఏఏ చట్టం విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తున్న భాజపా ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. నిత్యం ఆత్మవిమర్శ చేసుకునే ఏకైక పార్టీ భాజపా. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, తెదేపా, వైకాపా పార్టీలకు కాబోయే అధ్యక్షులెవరో ముందే తెలుస్తుంది. కానీ భాజపాలో అలా ఉండదు. ఇక్కడ తదుపరి పార్టీ చీఫ్‌ ఎవరవుతారో ఎవరికీ తెలియదు. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరు. అయినా నేను భాజపా అధ్యక్షుడిగా ఎదగడమే ఇందుకు ఉదాహరణ’’ అని నడ్డా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు