పెట్టుబడుల్నీ పంపేశారు: దేవినేని

విశాఖలో బలవంతంగా విమానం ఎక్కించి తెదేపా అధినేత చంద్రబాబు ఒక్కరినే పంపలేదని.. ఎన్నో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పౌరసరఫరాల శాఖ ద్వారా....

Published : 29 Feb 2020 00:21 IST

అమరావతి: విశాఖలో బలవంతంగా విమానం ఎక్కించి తెదేపా అధినేత చంద్రబాబు ఒక్కరినే పంపలేదని.. ఎన్నో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పౌరసరఫరాల శాఖ ద్వారా కొడాలి నాని రైతులకు చెల్లించాల్సిన రూ.1900కోట్లు బకాయిలు మాత్రమే చూపిస్తున్నారని..వాస్తవంగా చెల్లించాల్సింది రూ.3వేల కోట్ల పైమాటేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని తిట్టడం తప్ప మంత్రి కొడాలి నానికి ధాన్యం రైతుల సమస్యలు పట్టవా? అని నిలదీశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ తమ్మినేని జిల్లా శ్రీకాకుళంలో రూ.501కోట్లు బకాయిలు ఉన్నాయని దేవినేని గుర్తుచేశారు. స్పీకర్ స్థానంలో ఉండి చంద్రబాబుని విమర్శించే తమ్మినేనికి జిల్లా రైతు సమస్యలు పట్టవా? అని ఆయన ప్రశ్నించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని