దిల్లీ బాధితులకు విరాళంగా నెల జీతం: ఓవైసీ

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దిల్లీలో పెద్దఎత్తున విధ్వంసం జరిగినా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు విప్పట్లేదని హైదరాబాద్‌...

Published : 01 Mar 2020 15:22 IST

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దిల్లీలో పెద్దఎత్తున విధ్వంసం జరిగినా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు విప్పట్లేదని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఆవరణలో జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనన్నారు. విద్వేషపూరిత ఉపన్యాసాలు చేస్తున్నానని తనపై కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. దిల్లీ అల్లర్ల బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఓవైసీ పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. దిల్లీలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు