ఎన్నికేదైనా తెరాసదే విజయం: కేటీఆర్‌

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెరాస పార్టీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సహకార

Updated : 02 Mar 2020 13:50 IST

హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తెరాస పార్టీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మరోసారి రుజువైందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు. రైతు అయిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నందుకే రాష్ట్రంలో రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులకు రైతు బీమా, రైతు బంధు లాంటి ప్రత్యేక పథకాలను దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

తమపై ఉన్న అపారమైన ప్రేమతో రైతులు 906 సంఘాల్లో 94శాతానికి పైగా కట్టబెట్టి అపూర్వమైన విజయాన్ని అందించారని కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సహకార సంఘాల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లో ఎన్నికైన వారిలో 48శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు కేటీఆర్‌ వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని సహకార సంఘాల ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లకు ఈ సందర్భంగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని