ఒవైసీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?:కన్నా

గుంటూరులో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని

Published : 03 Mar 2020 00:34 IST

విజయవాడ: గుంటూరులో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సీఏఏపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరిగిన తర్వాతే చట్టం చేశారని గుర్తుచేశారు. విజయవాడలో కన్నా మీడియాతో మాట్లాడారు. ఓ వర్గానికి నష్టం జరుగుతుందంటూ ఎంఐఎం, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. తద్వారా లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై అల్లర్లు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కన్నా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంఐఎం అధినేత సమావేశం ఏర్పాటు చేస్తే దానికి వైకాపా నేత ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు. సీఏఏ వల్ల ఎవరికీ అన్యాయం జరగదని కన్నా చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు