బీసీలపై చిత్తశుద్ధి లేదని అర్థమైంది: చంద్రబాబు

ఏపీ స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల పట్ల వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో...

Updated : 03 Mar 2020 20:31 IST

అమరావతి: ఏపీ స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల పట్ల వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో ఆయన సమావేశమై చర్చించారు. అమరావతి రైతులకు అన్యాయం చేసేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం.. రిజర్వేషన్ల అమలులో మాత్రం సమర్థమైన న్యాయవాదిని పెట్టకుండా కేసును నీరుగార్చిందని ఆరోపించారు. బలహీన వర్గాలు తెదేపాకు అండగా ఉన్నారనే అక్కసు వైకాపాకు ఉందని, అందుకే రాజకీయంగా ఎదగకుండా చేస్తోందని ఆ పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనిత తదితరులు మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని