Published : 04 Mar 2020 01:21 IST

ఎన్‌పీఆర్‌పై సీఎం జగన్‌ కీలక ట్వీట్‌

అమరావతి: జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌)లోని కొన్ని అంశాలు మైనారిటీలను అభద్రతాభావానికి గురి చేసేవిధంగా ఉన్నాయని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. దీనిపై తమ పార్టీలో అంతర్గతంగా చర్చించామని.. అవసరమైన మేరకు కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జగన్‌ ట్వీట్‌ చేశారు. మైనార్టీల మనోభావాలకు అనుగుణంగా జాతీయ పౌర పట్టికపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని సీఎం స్పష్టం చేశారు. 2010 నాటి నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని కోరుతున్నామన్నారు. అంతకుముందు సీఎం క్యాంపు కార్యాలయంలో గుంటూరు-2 శాసనసభ్యుడు ముస్తఫా నేతృత్వంలో ముస్లిం మైనారిటీ వర్గాల ప్రతినిధులు జగన్‌ను కలిశారు. ఎన్‌పీఆర్‌, సీఏఏలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. అక్కడికి కాసేపటికే ఎన్‌పీఆర్‌పై జగన్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని