స్థానిక రిజర్వేషన్లపై సుప్రీంకు తెదేపా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తెదేపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ ఎంపీలు, నేతలు అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌ కావాలనే...

Updated : 05 Mar 2020 16:59 IST

దిల్లీ: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తెదేపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ ఎంపీలు, నేతలు అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌ కావాలనే వ్యూహాత్మకంగా బీసీలకు అన్యాయం చేస్తు్న్నారని.. తన అనుచరులతో హైకోర్టులో పిటిషన్‌ వేయించారని తెదేపా నేతలు ఆరోపించారు. సుప్రీంకోర్టులో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగించాలంటూ తమ పార్టీ నేతలు కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మల కిష్టప్ప, పల్లా శ్రీనివాసరావుతో కలిసి పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని