‘వైకాపాది దిల్లీలో ఒకమాట..ఏపీలో మరోమాట’

ఏపీ భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడితే మంచిదని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ఉద్యమంపై రాసిన ‘అమరావతి...

Published : 06 Mar 2020 02:31 IST

భాజపా ఎంపీ సుజనా వ్యాఖ్య

దిల్లీ: ఏపీ భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెడితే మంచిదని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని ఉద్యమంపై రాసిన ‘అమరావతి ఆక్రందన’, ‘స్టాప్‌ అన్‌డూయింగ్‌ ఆఫ్‌ అమరావతి’ పుస్తకాలను సుజనాచౌదరి దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజధాని ఉద్యమంలో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని చెప్పారు. వైకాపా నేతలు అమరావతిలో ఒకమాట.. దిల్లీలో మరోమాట చెబుతున్నారని ఆరోపించారు. 

ఏపీ అంటేనే పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని సుజనా వ్యాఖ్యానించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో ఏపీకి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు. అమరావతి కోసం కేంద్రం రూ.వేలకోట్ల నిధులు వెచ్చించిందన్నారు. వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉంటోందని ఆయన విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని