ఏపీలో స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు

Updated : 07 Mar 2020 12:04 IST

అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సరైన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలివిడత షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. ఈనెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించి, 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే 

* ఈనెల 9 నుంచి 11వరకూ నామినేషన్ల స్వీకరణ

* మార్చి 12న నామినేషన్ల పరిశీలన 

* మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ

* మార్చి 21న పోలింగ్‌

* మార్చి 24 ఓట్ల లెక్కింపు 

మున్సిపల్‌ ఎన్నికలు ఇలా..

* మార్చి 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ 
* మార్చి 27 ఫలితాలు

రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

పంచాయతీ ఎన్నికలు తొలిదశ రెండో దశ
నోటిఫికేషన్‌ 15వ తేదీ 17వ తేదీ
నామినేషన్లు 17-19 19-21
ఎన్నికలు 27వ తేదీ 29వ తేదీ
కౌంటింగ్‌ 27వ తేదీ 29వ తేదీ

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని