కుటుంబ సభ్యులే ఆరోపిస్తుంటే బాధేస్తోంది

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలపై ఆ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజు స్పందించారు. చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా?అని ఆమె సూటిగా....

Published : 08 Mar 2020 01:10 IST

విశాఖ: కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలపై మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజు స్పందించారు. చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా?అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కుటుంబ సభ్యులే తనపై ఆరోపణలు చేయడం బాధగా ఉందని సంచైత ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఆహ్వానించాల్సింది పోయి ఇలా రాజకీయ కోణంలో ఆరోపణలు తగదన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. తన నియామకంపై ఎవరైనా న్యాయస్థానానికి వెళ్లినా పోరాటం చేస్తానని తెలిపారు.  ట్రస్ట్‌ భూములు, దేవాదాయ భూములు ఎవరికీ చెందనివ్వమని స్పష్టంచేశారు. తన తాతగారు స్థాపించిన ట్రస్ట్‌ ద్వారా పేదలకు సేవలందిస్తానని చెప్పారు.

ఇదీ చదవండి
న్యాయపోరాటం చేస్తా: అశోక్‌గజపతిరాజు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని