కేటీఆర్‌ తక్షణమే రాజీనామా చేయాలి: భట్టి

తెరాస నేతలు 2వేల ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల వారు భూములు ఆక్రమించిన విషయం ప్రజలకు తెలియాలన్నారు. వెంటనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌...

Updated : 07 Mar 2020 19:49 IST

హైదరాబాద్‌: తెరాస నేతలు 2వేల ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల వారు భూములు ఆక్రమించిన విషయం ప్రజలకు తెలియాలన్నారు. వెంటనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డితో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయించాలని భట్టి డిమాండ్‌ చేశారు. 111 జీవోకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారన్నారు. ఎవరూ అటు పోనివ్వకుండా కాపాడుకోవాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ భూములకు సంబంధించి ఎంపీ రేవంత్‌ను అరెస్టు చేశారన్నారు. నగరంలో అక్రమ కట్టడాలేమైనా ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని చెప్పిన కేటీఆర్‌ దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు.

ఈ సాయంత్రం జన్వాడ గ్రామ పరిసరాల్లో 111 జీవోకు వ్యతిరేకంగా జరిగిన నిర్మాణాలను పరిశీలించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందం బయల్దేరి వెళ్లింది. అయితే, కోకాపేటలోని సబితానగర్‌ కూడలి వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకొని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయినవారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, వీరయ్య ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని