‘ఓడితే ఎమ్మెల్యేలు, మంత్రులదే బాధ్యత’

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడితే సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వైకాపా....

Published : 09 Mar 2020 01:32 IST

వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడితే సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఓటమి పాలైతే ఆ ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి మంత్రులు, ఎమ్మెల్యేలపై పడుతుందని వ్యాఖ్యానించారు. విశాఖలో స్థానిక ఎన్నికలపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబుతో కలిసి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో నైతిక విలువలు ఉండాలనే ఉద్దేశంతోనే మద్యం, డబ్బు పంపిణీ చేపట్టకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు విరాళాలు సేకరిస్తున్నాయని.. అది చట్టవిరుద్ధం అవుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. 

అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించి పేద ప్రజలకు న్యాయం చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంపై స్పందిస్తూ దేవుడి భూములను దోచే ఆలోచన ఎవరికీ లేదని స్పష్టం చేశారు. జీవీఎంసీ మేయర్‌ పదవికి కైవసం చేసుకోవడం వైకాపాకు ఎంతో ముఖ్యమని కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని