మధ్యప్రదేశ్‌: వెనక్కి వచ్చిన మరో ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఆదివారం మరొకరు వెనక్కి వచ్చారు. ఎమ్మెల్యే బిసాహులాల్‌ సింగ్‌ బెంగళూరు నుంచి భోపాల్‌కు విమానంలో వచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా తెలిపారు.

Published : 09 Mar 2020 01:31 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఆదివారం మరొకరు వెనక్కి వచ్చారు. ఎమ్మెల్యే బిసాహులాల్‌ సింగ్‌ బెంగళూరు నుంచి భోపాల్‌కు విమానంలో వచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా తెలిపారు. బిసాహులాల్‌ వెంట పర్యాటక మంత్రి సురేంద్ర బగేల్‌ ఉన్నట్లు చెప్పారు. భోపాల్‌లో దిగిన వెంటనే వారు నేరుగా సీఎం కమల్‌నాథ్‌ నివాసానికి వెళ్లారు. మిస్సింగ్‌ అయిన ఎమ్మెల్యేల రాకతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా చేసిన ప్రయత్నం విఫలమైందని హోంమంత్రి బాల బచ్చన్‌ అన్నారు. నిన్న వెనక్కి వచ్చిన స్వతంత్ర ఎమ్మెల్యే సైతం తాను కాంగ్రెస్‌ వైపునే ఉన్నట్లు ప్రకటించారు.

మధ్యప్రదేశ్‌లో ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం  రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదట వారిలో ఆరుగురు వెనక్కి వచ్చారు. ఆ తర్వాత మిగిలిన నలుగురిలోనూ మళ్లీ ఇద్దరు వెనక్కి వచ్చారు. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలు రావాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 114 మంది అభ్యర్థుల బలమే కాకుండా.. ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రులు ఏడుగురు సభ్యుల మద్దతు ఉంది. భాజపాకు 107 మంది అభ్యర్థుల బలం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని