Updated : 09 Mar 2020 14:29 IST

మాంద్యంలోనూ బ్రహ్మాండమైన బడ్జెట్‌:మంత్రులు

హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌, భాజపా నేతలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మంత్రులు అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌ మాట్లాడారు. ఆర్థిక మాంద్యంలోనూ బ్రహ్మాండమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టామని.. సీఎం కేసీఆర్‌ ఆరునెలల కసరత్తు ఫలితంగా ఇంత మంచి బడ్జెట్‌ రూపొందించగలిగామని చెప్పారు. ఆర్థిక రంగ మేధావులు బడ్జెట్‌ను స్వాగతించారన్నారు.

బీసీలకు పెద్ద పీట వేశామని.. అన్ని వర్గాలకు కేటాయింపులు పెరిగాయని తలసాని అన్నారు. 70 ఏళ్ల తర్వాత బీసీలకు తెలంగాణలో న్యాయం జరుగుతోందని చెప్పారు. అందరూ జ్యోతిరావు పూలే పేరు చెప్పుకున్నారని..కానీ ఆయన ఆశయాలను నిజంగా అమలు చేస్తోంది తెరాస సర్కారేనన్నారు. హైదరాబాద్‌లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తలసాని ప్రకటించారు. శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అద్భుతమైన బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్‌, భాజపాలు బిత్తరపోయి మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలోనూ బీసీలకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని.. బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని మరో మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని