
తెదేపాకు పులివెందుల నేత సతీశ్‌రెడ్డి రాజీనామా
పులివెందుల: కడప జిల్లా పులివెందులకు చెందిన తెదేపా నేత సతీశ్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ప్రాధాన్యం లేనందునే తెదేపాను వీడుతున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో పోరాడుతున్నా తెదేపా అధినేత చంద్రబాబుకు తనపై నమ్మకం లేదన్నారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై తెదేపాకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానని సతీశ్‌రెడ్డి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.