Updated : 10/03/2020 16:44 IST

సింధియాను బహిష్కరించిన కాంగ్రెస్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌పై అసంతృప్తిని వెళ్లగక్కుతూ  సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీ వీడారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. సింధియా తన నిర్ణయాన్ని వెల్లడించిన కాసేపటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సింధియాను తక్షణమే కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తున్నామని, ఇందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. 

స్వార్థపరుడిగా మారారు..

మరోవైపు సింధియా రాజీనామా నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనను పార్టీ ఎంతగానో గౌరవించిందని ఆ పార్టీ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌధురీ అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు స్వార్థపరుడిగా మారారని విమర్శించారు. కేంద్రంలో మంత్రిపదవి ఇస్తామని సింధియాకు మోదీ ప్రభుత్వం ఆశపెట్టి ఉంటుందని ఆరోపించారు. 

కాంగ్రెస్‌, భాజపా పోటాపోటీ సమావేశాలు..

ఇదిలా ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో అటు భాజపా, ఇటు కాంగ్రెస్‌ భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టాయి. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, జితు పట్వారీ, బాలా బచ్చర్‌ తదితరులు అత్యవసరంగా భేటీ అయ్యారు. అటు భాజపా నేతలు కూడా సమావేశమయ్యారు. 

ఇవీ చదవండి..

కాంగ్రెస్‌కు సింధియా రాజీనామా

మోదీని కలిసిన సింధియా

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని