మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకున్నారు. సుమవాలి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత అదల్‌ సింగ్‌ కన్సానా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు

Updated : 10 Mar 2020 17:17 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవి నుంచి తప్పుకున్నారు. అదల్‌ సింగ్‌ కన్సానా, మనోజ్‌ చౌధురి తమ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు పంపారు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 22కు పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి దిగజారింది. 

230 శాసనసభ స్థానాలు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో సభ్యుల సంఖ్య 228గా ఉంది. తాజాగా 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే.. అసెంబ్లీ బలం 206కు తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో కమల్‌నాథ్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 104 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు భాజపాకు 107 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. 

అమిత్ షా, నడ్డా భేటీ..

మరోవైపు మధ్యప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులపై భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సాయంత్రం నడ్డా సమక్షంలో జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరనున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు భాజపా.. సింధియాను నామినేట్‌ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతేగాక, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇవీ చదవండి..

ఎస్పీ, బీఎస్పీ మద్దతు కూడా భాజపాకేనా?

సింధియాను బహిష్కరించిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌కు సింధియా రాజీనామా

మోదీని కలిసిన సింధియా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని