‘వైఎస్‌ కుటుంబం బలం, బలహీనత తెలుసు’

పులివెందులకు చెందిన తెదేపా నేత సతీశ్‌రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తానని...

Published : 11 Mar 2020 00:40 IST

తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వ్యాఖ్య

కడప: పులివెందులకు చెందిన తెదేపా నేత సతీశ్‌రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. పులివెందులలో పార్టీ పరిస్థితులపై తెదేపా అధినేత చంద్రబాబుతో జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బీటెక్‌ రవితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతర వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలను బీటెక్‌ రవికి అప్పగించాలని చంద్రబాబు సూచించినట్లు శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. 

రాజకీయాల్లో పార్టీ మారడం సహజమే అయినా.. సతీశ్ రెడ్డి తెదేపాను వీడటం బాధగా ఉందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సతీశ్ రెడ్డి తన వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడినట్లు భావిస్తున్నానని చెప్పారు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం బలం, బలహీనతలు ఏంటో తనకు తెలుసని బీటెక్‌ రవి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయం కావడంతో అందరితో మాట్లాడి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని