కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడంలో మోదీ బిజీ

మధ్యపద్రేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులకు ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా

Published : 11 Mar 2020 12:35 IST

మధ్యప్రదేశ్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రధానిపై రాహుల్‌ ధ్వజం

దిల్లీ: మధ్యపద్రేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులకు ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రాహుల్‌ ప్రధానిపై ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూల్చడం గురించి ఆలోచించడం మాని.. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.

‘ప్రధాని మోదీ.. ప్రజలు ఎన్నుకొన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడంలో మీరు బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు 35శాతం తగ్గాయనే విషయాన్ని మీరు గుర్తించలేకపోయారు. దయచేసి పెట్రోల్‌ ధరలను లీటర్‌కు రూ.60 కిందకు తీసుకొచ్చి.. ఆ ప్రయోజనాలను మీరు భారతీయులకు బదిలీ చేస్తారా?  మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇంత ఎంతగానో దోహదపడుతుంది’ అని రాహుల్‌ ఈ ఉదయం ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. 

అయితే ఆ తర్వాత పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చిన రాహుల్‌ గాంధీ.. మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభంపై నేరుగా స్పందించేందుకు నిరాకరించారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటంపై మీడియా ప్రశ్నించగా.. అందుకు సమాధానం చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. 

ఇదీ చదవండి..

నేడే సింధియా భాజపాలో చేరిక?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని