ఇంటి పేరు వల్లే ఆయన ఎదిగారు

మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ స్పందించారు. ఇంటి పేరు కారణంగానే జ్యోతిరాదిత్య సింధియా రాజకీయంగా ఎదిగారని అన్నారు. గాంధీ ఇంటి పేరు కారణంగా కాంగ్రెస్‌.....

Published : 12 Mar 2020 01:18 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ స్పందించారు. ఇంటి పేరు కారణంగానే జ్యోతిరాదిత్య సింధియా రాజకీయంగా ఎదిగారని అన్నారు. ‘‘గాంధీ ఇంటి పేరు కారణంగా కాంగ్రెస్‌ పార్టీని తప్పుబట్టేవాళ్లు, సింధియా కాంగ్రెస్‌ను వీడటాన్ని పార్టీకి పెద్ద కుదుపుగా ఎలా భావిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవం ఏమిటంటే జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆయన ఇంటి పేరుతోనే మాస్‌ లీడర్‌గా, రాజకీయ నాయకుడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా ఎదిగారు’’ అని ప్రశాంత్ కిషోర్‌ వ్యంగంగా సింధియా రాజీనామాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

గ్వాలియర్‌ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడి భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తన రాజీనామాలో తెలిపారు. అయితే ఆయనతో పాటు కాంగ్రెస్‌కు చెందిన మరో 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని