కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌గా డీకే శివకుమార్‌

కాంగ్రెస్‌ పార్టీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దినేష్‌ గుండురావ్‌ను తప్పిస్తూ..

Published : 11 Mar 2020 17:16 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దినేష్‌ గుండురావును తప్పిస్తూ.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు గట్టెక్కించేలా ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఈశ్వర్‌ ఖండ్రే, సతీష్‌ జర్కిహోలి, సలీమ్‌ అహ్మద్‌లను నియమించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సీఎల్పీ లీడర్‌గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

2019 జులైలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి ప్రభుత్వంలోని 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. వారిని తిరిగి రప్పించేందుకు ఆయన ఎంతో తీవ్రంగా ప్రయత్నం చేశారు. పార్టీ ఒడుదొడుకులు ఎదుర్కొనే సమయంలో గట్టెక్కించగలడని ఆయనకు ట్రబుల్‌ షూటర్‌గా పేరుంది. కర్ణాటకలో గత డిసెంబర్‌లో జరిగిన 15 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలైన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని