పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు: చంద్రబాబు

వైకాపా కార్యకర్తలు, నేతలు తెదేపా అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడులతో సుమారు 180 మంది నామినేషన్లు వేయలేకపోయారని...

Updated : 12 Mar 2020 18:55 IST

అమరావతి: వైకాపా కార్యకర్తలు, నేతలు తెదేపా అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడులతో సుమారు 180 మంది నామినేషన్లు వేయలేకపోయారని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నామినేషన్లు వేయకుండా చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అభ్యర్థులపై బైండోవర్‌ కేసులు పెడుతూ పోలీసులు వేధిస్తున్నారన్నారు. చాలా చోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా చేసి వైకాపా నేతలు ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పాల్పడుతున్న అరాచకాలను ఆధారాలతో క్రోడీకరిస్తున్నామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని